News June 18, 2024
మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసిన జిల్లా అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను సత్యసాయి జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డితో పాటు పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం సత్యసాయి జిల్లా పరిస్థితులపై చర్చించారు.
Similar News
News April 2, 2026
అనంతపురం ఇక నుంచి 62 డివిజన్లు

50 డివిజన్లకు పరిమితమైన అనంతపురం నగరపాలక సంస్థకు మరో 12 డివిజన్లు అదనంగా పెంచారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62 డివిజన్లుగా మార్పు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలోని ఆశావాహులకు ఇదో చక్కటి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
News April 2, 2026
అమరావతి అజేయం.. లోక్‌సభలో బిల్లు ఆమోదం చరిత్రాత్మకం: ఎంపీ

AP రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని MP అంబికా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుల పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ఏపీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.