News June 18, 2024
యాక్సిడెంట్.. వైసీపీ ఎంపీ కూతురు అరెస్టు

చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్ అయ్యారు. బిసెంట్ నగర్‌లో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు పుట్‌పాత్‌పై దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడ నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సీసీ ఫుటేజీ సాయంతో విచారణ చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు నిర్ధారించి మాధురిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెకు బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News March 17, 2026
మాకు ఎవరి సాయం అక్కర్లేదు: ట్రంప్

NATO దేశాలు ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ట్రంప్ ఘాటుగా స్పందించారు. ‘నాటో ఎప్పుడూ వన్-వే ట్రాఫిక్ లాంటిదే. మేం వారిని రక్షిస్తాం. కానీ వారు మాకు సాయం చేయరు’ అని విమర్శించారు. ఇరాన్ సైనిక శక్తిని ఇప్పటికే చిన్నాభిన్నం చేశామని పేర్కొన్నారు. అందుకే ఇకపై తమకు ఎవరి సాయం అవసరం లేదని, అమెరికా ఒంటరిగానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు.
News March 17, 2026
ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి ఫిఫా అదిరిపోయే గిఫ్ట్

2026 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఇప్పుడు యూట్యూబ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ జూన్ 11 నుంచి జులై 19 వరకు జరిగే టోర్నీలో ప్రతి మ్యాచ్ మొదటి 10 నిమిషాలను బ్రాడ్‌కాస్టర్లు తమ యూట్యూబ్ ఛానల్స్‌లో లైవ్ స్ట్రీమ్ చేయొచ్చని ఫిఫా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా కొన్ని సెలక్టెడ్ మ్యాచ్‌లను పూర్తిస్థాయిలో ఫ్రీగా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈసారి WC అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనుంది.
News March 17, 2026
నవోదయ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) JNVST 6వ తరగతి ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేసింది. షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత అడ్మిషన్ ఖరారు అవుతుంది. రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <


