News June 18, 2024
రాష్ట్రంలోని ఆలయాల పూర్వవైభవానికి కృషి: మంత్రి ఆనం

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయాల పూర్వవైభవానికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు సంతపేటలోని మంత్రి నివాసంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక శతాబ్ధాల చరిత్ర గల ఆలయాలు ఎన్నో ఉన్నాయని, వీటి అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు.
Similar News
News April 1, 2026
నేటి నుంచి 23 వరకు ఇంటర్ సెకండియర్ తరగతులు

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోగల జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులను నేటి నుంచి 23 వరకు నిర్వహించాలని RIO వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు కండక్ట్ చేయాలని సూచించారు. అనంతరం మే30 వరకు వేసవి సెలవులుంటాయని వివరించారు. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News April 1, 2026
నెల్లూరు జిల్లాకు CM.. వీటిపై ఏమంటారో?

ప్రభుత్వాలు మారినా ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జాడే లేదని స్థానికులు అంటున్నారు. వింజమూరులో బుధవారం CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి కోసం గతంలో ఏర్పాటు చేసిన సుజల స్రవంతి వాటర్ ఫ్లాంట్లు, 14 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న గండిపాలెం రిజర్వాయర్‌పై ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వింజమూరు సమ్మర్ స్టోరేజ్ నేటికీ కార్యరూపం దాల్చలేదు. వీటిపై CM ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
News April 1, 2026
35KMల రోడ్డు కోసం 50ఏళ్లుగా ఎదురుచూపులు..!

35KMల నందవరం-ఉదయగిరి రోడ్డు 2 నియోజకవర్గాలను కలుపుతుంది. సింగల్ రోడ్డు కావడంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 50ఏళ్ల నుంచి ఆ ప్రాంతవాసులు రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. అయినా వారికి నిరాశ తప్పడం లేదు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల మధ్య రహదారి ఉండడంతో ఎవరూ మొగ్గు చూపడం లేదు. చుట్టుపక్కలంతా హైవే ఉన్నా ఇదొక్క రోడ్డు మాత్రమే పూర్తిచేయడం లేదు. సీఎం దీనిపై స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.


