News June 18, 2024

జూ.కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్

image

AP: ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందుతున్నాయి. ఇకపై వాటితోపాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లనూ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. KGBVలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్‌లలో చదివే స్టూడెంట్లకూ తెలుగు అకాడమీ ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష డైరెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

Similar News

News October 7, 2024

నీట్ యూజీ పేపర్ లీకేజీకి అధునాతన టూల్ కిట్ వాడారు.. ఛార్జ్‌షీట్‌లో CBI

image

నీట్ యూజీ పేప‌ర్ లీకేజీకి నిందితులు అధునాత‌న టూల్ కిట్‌ను ఉప‌యోగించి ప‌రీక్ష పేప‌ర్ల ట్రంక్ పెట్టెను తెరిచిన‌ట్టు CBI ఛార్జ్‌షీట్‌లో వెల్ల‌డించింది. ఈ వ్య‌వ‌హారంలో 144 మంది అభ్య‌ర్థులు పేప‌ర్ లీక్ కోసం పెద్ద మొత్తంలో డ‌బ్బులు చెల్లించిన‌ట్టు తెలిపింది. ఝార్ఖండ్‌లోని హ‌జారీబాగ్ ఒయాసిస్ స్కూల్ నుంచి పరీక్షకు కొన్ని గంటల ముందు పేప‌ర్ లీకైన‌ట్టు తేలింది. ప్రధాన నిందితులు సహా 49 మందిని అరెస్టు చేసింది.

News October 7, 2024

కౌలు రైతులకు రుణాలు: మంత్రి అచ్చెన్న

image

AP: కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇటీవల పరిహారం ఇచ్చామని, కౌలు రైతులకు నేరుగా పరిహారం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పారు. ప్రాంతీయ సదస్సుల ద్వారా అభిప్రాయాలు తీసుకొని కౌలు చట్టం రూపకల్పన చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన కౌలు చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

News October 7, 2024

వారికి రూ.5,00,000 ఆర్థిక సాయం

image

గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయంపై తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. DEC 7, 2023 తర్వాత బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ, UAEల్లో ఎలాంటి కారణంతోనైనా చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇవ్వనుంది. చనిపోయిన 6 నెలల్లోపు డెత్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, వర్క్ వీసా, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, బ్యాంక్ వివరాలతో కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.