News June 18, 2024
ఇయర్ ఫోన్స్ ఎక్కువ సేపు వాడినా ఈ వ్యాధి రావొచ్చు: వైద్యులు

సింగర్ అల్కా యాగ్నిక్‌కు సోకిన <<13462020>>వ్యాధి<<>>కి గల కారణాలను డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ‘ఇది వైరల్ ఇన్ఫెక్షన్. వినికిడి లోపానికి అనేక వైరస్‌లు కారణం. ENT సర్జన్ క్లినికల్ పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. కొన్ని రోజులు మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. వైరల్ సంక్రమణకు గురికాకుండా జాగ్రత్త పడాలి. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండండి. ఇయర్ ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించొద్దు’ అని తెలిపారు.
Similar News
News March 10, 2026
Viral: పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష!

TG: ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్‌కు చెందిన హాల్ యజమాని బోర్డు పెట్టడం వైరల్‌గా మారింది. కొందరు ఇన్విటేషన్ లేకున్నా వస్తుండటంతో చాలా మంది తమ హాల్‌లో ఫంక్షన్లు చేయట్లేదని, దీంతో గిరాకీ తగ్గిందని ఆయన చెప్పారు. దీన్ని నివారించేందుకే ఫంక్షన్ హాల్ ఎదుట.. ‘ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తాం’ అని బోర్డు పెట్టారు.
News March 10, 2026
ఇకపై 4 కేటగిరీలుగా పంచాయతీలు

AP: జనాభా, ఆదాయం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 3 రకాలుగా ఉన్న పంచాయతీలు ఇకపై 4 రకాలు కానున్నాయి. 10Kకు పైగా జనాభా, ₹కోటి వార్షిక ఆదాయం ఉన్న వాటిని రూర్బన్ పంచాయతీలుగా పరిగణించి పట్టణ తరహా సౌకర్యాలు కల్పిస్తారు. 3K-10K జనాభా, ₹30Lపైన ఆదాయం ఉంటే గ్రేడ్-1, 2Kలోపు జనాభా ఉంటే గ్రేడ్-2, 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-3లో చేరుస్తారు.
News March 10, 2026
ఇన్‌స్టాలో సంజూ హవా..

T20WCలో అద్భుత ప్రదర్శనతో సంజూ శాంసన్ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచుకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో శాంసన్‌కు 12.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఆ మ్యాచుతో పాటు సెమీఫైనల్, ఫైనల్లోనూ చెలరేగడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 17.5 మిలియన్లకు చేరింది. ఫైనల్లో టీమ్ ఇండియా విజయం తర్వాత ఏకంగా 1 మిలియన్‌కు పైగా నెటిజన్లు అతడిని ఫాలో కొట్టడం విశేషం.


