News June 19, 2024

MBNR: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

సివిల్ సర్వీసు-2025 సంవత్సరంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఉచితశిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎ.స్వప్న, జిల్లా బి.సి. అభివృద్ధి అధికారి ఆర్.ఇందిరా తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన BC, SC, ST అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని కోరారు.

Similar News

News March 13, 2026

MBNR: పదో తరగతి పరీక్షలు.. జిల్లా విద్యాశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం చేశారు. ​పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఏవైనా సందేహాలున్నా, సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్‌ను 83747 72282ను సంప్రదించాలని డీఈవో ప్రవీణ్ కుమార్ సూచించారు.

News March 13, 2026

MBNR: ఈనెల 15 నుంచి అంబేడ్కర్ వర్సిటీ తరగతులు

image

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ II, IV, VI తరగతులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న విద్యార్థులనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాల కోసం 73829 29609 నంబరును సంప్రదించాలని కోరారు.

News March 13, 2026

MBNR: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: SP

image

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పరీక్షా సమయాల్లో (ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు) కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 163 BNSS యాక్ట్ ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.