News June 19, 2024
VZM: మాజీ సీఎం జగన్‌తో జిల్లా నేతల భేటీ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ జిల్లా నాయకులు మంగళవారం భేటీ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితరులు జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.
Similar News
News March 16, 2026
VZM: నేడే పదవ తరగతి పరీక్షలు

నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 119 కేంద్రాల్లో 23,529 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.9:30 నుంచి మ.12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. హాల్ టికెట్‌పై సంబంధిత స్కూల్ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతించనున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సందేహాలు ఉంటే 7382157686 ఫోన్ చేయవచ్చు. ఆల్ ది బెస్ట్.
News March 16, 2026
భోగాపురం కనెక్టివిటీ రోడ్ల క్లియరెన్సుకు సీఎం ఆదేశం: మంత్రి నారాయణ

భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.