News June 19, 2024
డిప్యూటీ సీఎంను కలిసిన గుంటూరు జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కల్యాణ్‌ని మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, మంగళవారం గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై చేపట్టిన చర్యలపై పవన్‌తో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.
Similar News
News March 20, 2026
GNT: పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది కోసం గ్రీవెన్స్ జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ సమస్యలు తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, జరిగిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని అన్నారు.
News March 20, 2026
GNT: చిన్న శివలింగం వెనుక పెద్ద కథ.. లోకేశ్ వివరణ

పూజ గదిలో ఉన్న బొమ్మలపై వచ్చిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ Xలో స్పందించారు. నాలుగేళ్ల వయసులో తన కుమారుడు దేవాన్ష్ తయారు చేసిన శివుడి బొమ్మ, చిన్న శివలింగాన్ని జ్ఞాపకంగా పూజా గదిలో ఉంచినట్లు తెలిపారు. చిన్న వయసులోనే శివ భక్తుడిగా ఎదుగుతున్నాడని చెప్పారు. భక్తి అనేది కొందరికి అర్థమవుతుందని, మరికొందరికి కాదని, అలాంటి భక్తికి వివరణ అవసరం లేదని పేర్కొన్నారు.
News March 20, 2026
గుంటూరులో ప్రత్యేక డ్రైవ్.. రూ.5.36 లక్షల జరిమానా

గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డు, కాకాని రోడ్డులో పోలీసులు జాతీయ, రాష్ట్ర రహదారులపై గురువారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 922 వాహనదారులకు రూ.5.36 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల భద్రత పెంచడం ప్రధాన లక్ష్యం అని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.


