News June 19, 2024

కేంద్రం అనుమతితో చేపట్టిన నిర్మాణాల్లో అవినీతి ఎక్కడుంది?: రోజా

image

AP: రుషికొండలో పర్యాటక శాఖ భవనాల నిర్మాణం తప్పా? అని కూటమి ప్రభుత్వాన్ని YCP మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. ‘విశాఖను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా? వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లు నాణ్యతతో కట్టిన భవనాలను చూసి ఓర్వలేకపోతున్నారా? కేంద్రం అనుమతితో చేపట్టిన నిర్మాణాల్లో అక్రమం ఎక్కడుంది?’ అని Xలో ప్రశ్నల వర్షం కురిపించారు.

Similar News

News January 8, 2025

40 ఏళ్ల అనుభవం.. చివరికి ఇస్రో ఛైర్మన్‌గా..

image

ఇస్రో కొత్త <<15093696>>ఛైర్మన్‌గా<<>> నియమితులైన వి.నారాయణన్ ప్రస్తుతం సంస్థలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్(LPSC) డైరెక్టర్‌గా ఉన్నారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన 40 ఏళ్లుగా పలు కీలక స్థానాల్లో పనిచేశారు. నారాయణన్ సారథ్యంలోనే GSLV Mk-3 ద్వారా C25 క్రయోజెనిక్ ప్రాజెక్టు విజయవంతమైంది. అలాగే చంద్రయాన్-2, 3, ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ మిషన్లకు నారాయణన్ నాయకత్వంలోని బృందమే ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను రూపొందించింది.

News January 8, 2025

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్

image

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) కొత్త ఛైర్మన్‌గా డా.వి.నారాయణన్ నియమితులయ్యారు. ఈమేరకు ఇస్రో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఎస్.సోమనాథ్ ఉన్నారు. ఆయన సారథ్యంలోనే చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది.

News January 8, 2025

శుభ ముహూర్తం (08-01-2025)

image

✒ తిథి: శుక్ల నవమి మ.2:18 వరకు ✒ నక్షత్రం: అశ్విని సా.4.44 వరకు ✒ శుభ సమయాలు సా.3.21-4.21 ✒ రాహుకాలం: ప.12.00-1.30 ✒ యమగండం: ఉ.7.30-మ.9.00 ✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 ✒ వర్జ్యం: మ.1.01-2.31, రా.1.41-3.11 ✒ అమృత ఘడియలు: ఉ.10.01-11.30.