News June 19, 2024

మంత్రి స్వామిని కలిసిన ప్రకాశం కలెక్టర్

image

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామికి కలెక్టర్ పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.

Similar News

News March 12, 2026

పొదిలి: వామ్మో.. ఇలానూ మోసం చేస్తారా..?

image

పొదిలిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే సమయంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు లైసెన్స్ లేదు. తనిఖీలు చేయకుండా ఉండాలంటే రూ.60వేలు ఇవ్వండి’ అని కోరగా.. భయపడిన నిర్వాహకుడు రూ.6వేలు ఫోన్ పే చేశాడు. అసలు అధికారి తనిఖీలకు వెళ్లగా.. మీకు డబ్బులు పంపానని నిర్వాహకుడు చెప్పాడంతో ఆయన అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 12, 2026

ప్రకాశం: వడగాల్పుల వేళ ముందస్తు చర్యలు

image

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.

News March 11, 2026

రేపు కనిగిరిలో జాబ్ మేళా..!

image

కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ,బీ.టెక్, తదితర కోర్సులు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు వారు ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్ట్, 2 పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.