News June 19, 2024

ప్రభుత్వ సేవలను విస్తృతం చేయాలి: అన్నమయ్య కలెక్టర్

image

ప్రభుత్వ శాఖలలో ప్రజలకు అందించే రోజువారి సేవలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ సేవలు, భూ సేకరణ, సివిల్ సప్లై తదితర అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.

Similar News

News March 16, 2026

నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

image

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.

News March 16, 2026

కడప: ‘ఓపెన్ 10th పరీక్షలకు 22 స్క్వాడ్లు ఏర్పాటు’

image

కడప జిల్లాలో ఓపెన్ 10th పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ నివారణకు 22 స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడపలో ఆదివారం 10th పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. 2,424 మంది విద్యార్థులు ఓపెన్ 10th పరీక్షలను 31 కేంద్రాల్లో రాయనున్నారు. పటిష్ఠంగా పరీక్షల నిర్వహణ కోసం 6 ఫ్లయింగ్, 16 సిట్టింగ్ స్క్వాడ్లు, 31 చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు.

News March 16, 2026

కాజీపేటలో LPG సిలిండర్ల స్వాధీనం

image

ఖాజీపేటలోని పలు హోటళ్లపై V&E, సివిల్ సప్లై అధికారులు ఆదివారం అకస్మిక దాడులు చేపట్టారు. గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని 6 కేసులు నమోదు చేసి, 16 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని, భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.