News June 19, 2024

రాహుల్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించారని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ వయనాడ్ నుంచి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

Similar News

News January 20, 2026

ఇతిహాసాలు క్విజ్ – 129 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
సమాధానం: రావణుడి సోదరి అయిన శూర్పణఖ అసలు పేరు మీనాక్షి. చేప వంటి కళ్లు గలది అని దీనర్థం. అయితే ఆమె గోళ్లు పెద్దవిగా ఉండేవి. అలాగే పదునుగా కూడా ఉండేవి. అందువల్లే ఆమెను ‘శూర్పణఖ’ అని పిలవడం మొదలుపెట్టారు. శూర్పణఖ అంటే జల్లెడ వంటి గోళ్లు కలది అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 20, 2026

హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్

image

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. నిండుగర్భంతో బ్లాక్ డ్రెస్సులో తాజాగా ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురైన సోనమ్ 2018లో ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే వాయు అనే కుమారుడు ఉన్నారు. 2007లో ‘సావరియా’తో తెరంగేట్రం చేసిన ఆమె భాగ్ మిల్కా భాగ్, నీర్జా, పాడ్ మ్యాన్, ది జోయా ఫ్యాక్టర్ వంటి సినిమాల్లో నటించారు.

News January 20, 2026

సూచీలు కుప్పకూలడానికి కారణాలు ఇవే

image

దేశీయ స్టాక్ మార్కెట్లు <<18907026>>భారీ నష్టాలు<<>> చూసిన విషయం తెలిసిందే. EU దేశాలతో అమెరికా ట్రేడ్ వార్‌కు దిగడం అంతర్జాతీయంగా అనిశ్చితికి కారణమైంది. అదే సమయంలో నిన్న విదేశీ మదుపర్లు రూ.3,262 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత పతనం కావడం, క్రూడాయిల్ ధరలు పెరగడం, కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం అమ్మకాల ఒత్తిడిని పెంచింది.