News June 19, 2024

T20WC: నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు

image

టీ20 వరల్డ్ కప్‌లో నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ గ్రూప్-2లోని యూఎస్ఏ, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో సంచలనాలు చేసిన అమెరికా ఈ మ్యాచులో ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Similar News

News March 15, 2026

మెటాలో భారీగా ఉద్యోగాల కోత?

image

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. AIపై పెట్టుబడుల నేపథ్యంలో తమ వర్క్‌ఫోర్స్‌లో 20% మందిని తొలగించే అవకాశం ఉందని రాయిటర్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మెటాలో 79 వేల మంది పని చేస్తున్నారు. అంటే 15 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపనుందని సమాచారం. 2022-23 తర్వాత ఇదే అతి పెద్ద లేఆఫ్ కానుంది. 2022లో 11 వేల మందిని, 4 నెలల తర్వాత మరో 10 వేల మందిని కంపెనీ తొలగించింది.

News March 15, 2026

మార్చి15: చరిత్రలో ఈరోజు

image

*1564: జిజియా పన్ను రద్దు
*1934: BSP స్థాపకుడు కాన్షీరాం జననం(ఫొటోలో)
*1937: తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం
*1950: ప్రణాళికా సంఘం ఏర్పాటు
*1977: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జననం
*1993: బాలీవుడ్ నటి ఆలియా భట్ జననం
*ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

News March 15, 2026

రప్పా రప్పా అంటే ఈ సీట్లు కూడా రావు: నాగబాబు

image

AP: రప్పా రప్పా అంటే వైసీపీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని జనసేన MLC నాగబాబు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని అన్నారు. తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ YCP అని, హిందూ మతాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఓడిపోయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. శ్రీకాకుళం(D) లావేరులో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.