News June 19, 2024
ఈనెల 21న హిందూస్థాన్ షిప్‌యార్డ్ వ్యవస్థాపక వేడుకలు
హిందుస్థాన్ షిప్ యార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈనెల 21వ తేదీన నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు మంగళవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా ఉద్యోగులకు అత్యవసర వైద్య సేవలు అందించే యార్డులో ఆసుపత్రిని ఆధునీకరించారు. ఉద్యోగుల నివాస సముదాయంలో 36 క్వార్టర్స్‌ను 3 దశలో మరమ్మతులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News January 15, 2025
గాజువాకలో దారుణం.. చిన్నారి మృతి
గాజువాకలోని పండగ వేల ఒక అపార్ట్మెంట్ వద్ద సెల్లార్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొంది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతనగర్ ప్రాంతానికి చెందిన భోగిర్ల లారీణి తన తల్లిదండ్రులతో సెల్స్ట్ అపార్ట్మెంట్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. చిన్నారి ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు కారు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News January 14, 2025
మధురవాడ: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
మధురవాడ జాతీయ రహదారిపై ఆనందపురం వెళుతున్న ఓ బైక్‌పై లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు ఢీకొనడంతో వెనుక కూర్చున్న మహిళ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పీఎం పాలెం ట్రాఫిక్ సీఐ సునీల్ దర్యాప్తు చేపట్టారు.
News January 14, 2025
విశాఖ నుంచి 300 బస్సులను నడిపిన ఆర్టీసీ
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం 300 స్పెషల్ బస్సులను నడిపినట్లు ఆర్టీసీ విశాఖ ప్రాంతీయ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, టెక్కలి, పలాస రూట్లలో ప్రయాణికులను ఎప్పటికప్పుడు బస్సుల్లో పంపించినట్లు పేర్కొన్నారు. ద్వారక ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌లో దుకాణాలను తనిఖీ చేసి, ఎంఆర్పీ రేట్లకే వస్తువులను విక్రయించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.