News June 19, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 75,125మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,140మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

Similar News

News March 12, 2026

ఇంటర్ పూర్తయిందా?.. ఓ లుక్కేయండి!

image

<<19343753>>ఇంటర్<<>> పూర్తయినవారు రెగ్యులర్ కోర్సులకే పరిమితం కాకుండా క్రియేటివిటీతో కూడిన డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. క్రియేటివిటీ ఉన్నవారు డిజైన్ (NID/NIFT) కోర్సుల ద్వారా రాణించవచ్చు. పర్యాటక రంగం విస్తరిస్తుండటంతో హోటల్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీకి మంచి డిమాండ్ ఉంది.

News March 12, 2026

కొత్త ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

image

ఈనెల 19న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరంలో అన్ని రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాల పంచాగాన్ని ‘భక్తి’ టీవీ విడుదల చేసింది. ముఖ్యంగా మిథున రాశివారికి ఆదాయం కంటే వ్యయం & రాజ్య పూజ్యం కంటే అవమానాలే ఎక్కువగా ఉంటాయని పండితులు తెలిపారు. సింహ రాశి వారికి అన్నీ సరిసమానంగా ఉంటాయని చెప్పారు. మీ రాశి ఏంటో కామెంట్ చేసి షేర్ చేయండి.

News March 12, 2026

ఫిరాయింపుల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు

image

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో BRS పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే పిటిషన్లను పరిష్కరించారని న్యాయవాది సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు విచారణ ముగిసినట్లు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ప్రకటించింది. 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా స్పీకర్ ప్రసాద్ 10 మందికి MLAకు <<19352106>>క్లీన్‌చిట్<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.