News June 19, 2024

లిఫ్ట్‌లో అంతరిక్షానికి.. జపాన్ కంపెనీ ప్లాన్!

image

ఆకాశానికి నిచ్చెన వేయడం అనే అతిశయోక్తిని మనం వింటూంటాం. జపాన్‌కు చెందిన ఒబయాషీ కార్పొరేషన్ సంస్థ నిజంగానే ఆకాశానికి నిచ్చెన వేస్తోంది. మనుషుల్ని రోదసికి లిఫ్ట్‌లో పంపించేలా ప్లాన్ చేస్తోంది. భూమి నుంచి శాటిలైట్ వరకు కేబుల్ వేసి దాని ద్వారా 96వేల కిలోమీటర్ల ఎత్తులోని ఉపగ్రహం వద్దకు చేర్చేలా ప్లాన్ వేసింది. 2050కల్లా దీన్ని సాధ్యం చేయాలని భావిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 100 బిలియన్ డాలర్లు!

Similar News

News February 3, 2025

ప్రభాస్ ‘కన్నప్ప’ లుక్‌పై ట్రోల్స్

image

కన్పప్పలో ప్రభాస్ లుక్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ లుక్ ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో నాగార్జున లుక్‌ను పోలి ఉందని పలువురు పోస్టులు చేస్తున్నారు. విగ్ సెట్ అవలేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా లుక్‌పై ఫోకస్ చేయాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ లుక్‌పై మీ కామెంట్?

News February 3, 2025

పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు: రోజా

image

AP: కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘కూటమి నేతల అరాచకాల్ని ఖండిస్తున్నాం. తిరుపతిలో మేయర్ ఎన్నిక సందర్భంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. మీరు నిజంగా ప్రజా మద్దతుతో గెలిచి ఉంటే ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.

News February 3, 2025

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

image

ఇంగ్లండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించిన టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ అరుదైన జాబితాలో చేరారు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేయడంతో పాటు రెండు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా శర్మ చరిత్ర సృష్టించారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇంగ్లండ్ జట్టుపై 103 పరుగులతో పాటు మూడు వికెట్లు తీశారు. శర్మ కూడా ఇంగ్లండ్‌పై 135 రన్స్ చేసి 2 వికెట్లు పడగొట్టారు.