News June 19, 2024
హుస్నాబాద్‌లో హత్య UPDATE

హుస్నాబాద్(M) కూచన్‌పల్లి వాసి నరసయ్య(55)ను <<13461790>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. SI మహేశ్ వివరాలు.. నర్సయ్య సామగ్రి ఏరుకుంటూ విక్రయించేవాడు. మద్యానికి బానిసై రోజు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి అతని భార్య లేచి చూసేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి నర్సయ్య భార్య, తమ్ముడి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 4, 2026
మెదక్: ఈ మండలాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్

మెదక్ జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోని 80 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదన్నారు. ముందస్తు సమాచారాన్ని సర్పంచ్‌లకు చేరవేశామని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.
News March 4, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.21% హాజరు

మెదక్ జిల్లాలో ఆరో రోజు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. బాటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-IIA పరీక్షలకు మొత్తం 98.21 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,017 మందికి గాను 4,932 మంది, ఒకేషనల్ విభాగంలో 541 మందికి గాను 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.
News March 4, 2026
మెదక్: కలెక్టర్‌ను కలిసిన అడిషనల్ ఎస్పీ

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను అడిషనల్ ఎస్పీ మహేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల గురించి ఆమెకు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.


