News June 19, 2024

కరీంనగర్ కలెక్టర్ బదిలీ ఆగినట్లేనా?

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పమేల సత్పతి కొనసాగనున్నారా ? కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతలు తీసుకోరా? అనే చర్చ అధికార వర్గాల్లో కొనసాగుతుంది. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశాల్లో ప్రస్తుత కలెక్టర్ పమేల సత్పతి పాల్గొనడంతో బదిలీ ఆగిందనే చర్చ కలెక్టరేట్ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది.

Similar News

News December 28, 2025

KNR: ప్రశాంతంగా వేడుకలు జరుపుకోండి: సీపీ

image

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని, అతివేగం వల్ల ప్రమాదాల బారిన పడవద్దని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకాలని కోరారు.

News December 28, 2025

కరీంనగర్: ఓపెన్‌ స్కూల్‌ పరీక్షా ఫీజు గడువు ఖరారు

image

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫీజు జనవరి 5 వరకు చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్‌ రామడుగు రవీందర్‌ తెలిపారు. 25 రూపాయల ఫైన్‌తో జనవరి 6 నుంచి 12 వరకు, 50 రూపాయల ఫైన్‌తో జనవరి 13 నుంచి 16 వరకు, అలాగే తత్కాల్‌ పద్దతి కింద జనవరి 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. వివరాలకు 9440415099 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

News December 28, 2025

జమ్మికుంట: అంబేద్కర్ వర్సిటీ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

image

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించే గడువును జనవరి 2వ తేదీ వరకు పొడిగించినట్లు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో బి.ఏ, బి.కామ్‌, బి.ఎస్సీ చదువుతున్న మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.