News June 19, 2024

మీ బెంజ్‌ కారు గురించి చెప్పండి: భాను

image

రుషికొండపై నిర్మాణాలను సమర్థిస్తూ రోజా <<13465987>>ట్వీట్ <<>>చేశారు. ఇందులోనే చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం, ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉండటంపై రోజా విమర్శలు చేశారు. దీనికి నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ కౌంటర్ ఇచ్చారు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్‌కు.. మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండి మాజీ మంత్రి గారు’ అని భాను ట్వీట్ చేశారు.

Similar News

News March 28, 2026

చిత్తూరు: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు

image

జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ శనివారం హెచ్చరించారు. ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకోసం పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా బెట్టింగ్లకు పాల్పడితే 112, 9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News March 28, 2026

చిత్తూరు: పంచాయితీ అక్రమాలపై ఫిర్యాదులకు సిద్దం.?

image

చిత్తూరు జిల్లాలోని 811 పంచాయితీలలో ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. దీంతో కూటమి నేతలు గత ఐదేళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. ఇది పార్టీల మధ్య కొత్త సమస్యకు దారి తీయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

News March 28, 2026

జీడీ నెల్లూరు వ్యక్తి బ్లాక్‌మెయిల్ దందా.. రూ.50 లక్షలు డిమాండ్

image

జీడీ నెల్లూరు మండలానికి చెందిన తుమ్మలపల్లి వీరయ్య, మరో వ్యక్తితో కలిసి సబ్-రిజిస్ట్రార్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ దందాకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరింపులకు దిగుతూ, రూ.50 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.