News June 19, 2024
HYD నగరంలో వేగంగా ఆసుపత్రుల నిర్మాణం!

HYD నగరంలోని కొత్తపేట, అల్వాల్, సనత్ నగర్‌లో గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ మూడు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే.. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై భారం తగ్గనుంది. అత్యాధునిక వసతులతో, నూతన టెక్నాలజీ ఉపయోగించి రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపడుతోంది. ప్రత్యేక ఇంజినీర్ల బృందం నాణ్యతపై ఇటీవల చెకింగ్ చేసింది.
Similar News
News April 1, 2026
HYD: రూ.2,501 కోట్ల ఆస్తి పన్ను వసూలు

క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,501.25 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. భారీ బకాయిదారులకు వడ్డీపై 90 శాతం రాయితీ, ఓటీఎస్ సదుపాయాన్ని వివరించడం, ఇతరత్రా చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే వంద కోట్లకు పైగా ఆస్తి పన్ను జీహెచ్ఎంసీ ఖజానాకు చేరినట్లు సమాచారం. కాగా, సరైన లెక్కలు నేడు స్పష్టం కానున్నాయి.
News March 28, 2026
RR జిల్లాలో HPV వ్యాక్సినేషన్ సెంటర్లు ఇవే..!

రంగారెడ్డి జిల్లా పరిధిలో అనేక చోట్ల HPV వాక్సినేషన్ ప్రారంభించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు బాలికలకు అందిస్తున్నారు. రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొండాపూర్ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ప్రాంతాల్లో వీటిని అందిస్తున్నారు. తల్లిదండ్రులతో ప్రతి ఒక్కరు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు.
News March 25, 2026
ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: RR కలెక్టర్

ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్ క్లియర్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్వో సంగీత, తదితరులు ఉన్నారు.


