News June 19, 2024

చిత్తూరు: 20 నుంచి ఐటీఐల్లో ప్రవేశాలు

image

ఐటీఐల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 22 వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చిత్తూరు ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి తెలిపారు. మొదటి రోజు మెరిట్ ప్రకారం ఉదయం 1 నుంచి 100 వరకు, మధ్యాహ్నం 101 నుంచి 205వరకు అడ్మిషన్లు ఇస్తారు. 21న 206నుంచి 350వరకు, తర్వాత 351 నుంచి 451వరకు, 22న ఉదయం 452నుంచి 600వరకు, మధ్యాహ్నం 601నుంచి 743 వరకు ప్రవేశాలు జరుగుతాయన్నారు.

Similar News

News July 5, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

2020 జులై 20వ తేదీన మైనర్ బాలికపై రామకృష్ణ(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2025 జులై 4వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన దిశ డీఎస్‌పీ బాబు ప్రసాద్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చౌడేపల్లి సీఐ భూపాల్, ఎస్సై శివశంకర్లను జడ్జ్ అభినందించారు.

News July 5, 2025

చిత్తూరు: బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

image

పోలీసు శాఖలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్పీ మణికంఠ శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ బాబు సతీమణి మాధవి, గుడిపల్లి స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మీ భర్త ఆనంద్‌కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.

News May 8, 2025

మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యే థామస్ భేటీ

image

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.