News June 19, 2024
ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్

విజయవాడ సచివాలయంలో బుధవారం శాసన సభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన మంత్రికి సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 15, 2026
అనంతపురం జిల్లాలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.260, స్కిన్ లెస్ రూ.280, అనంతపురంలో రూ.260, స్కిన్ లెస్ రూ.280 గుంతకల్లులో రూ.240, స్కిన్ లెస్ రూ.260కు విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీపై రూ.20 పెరిగినట్లు పేర్కొన్నారు.
News March 15, 2026
అనంతలో ఆశాజనకంగా చీనీ ధరలు

చీనీ ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. తగ్గుముఖం పడుతున్న టమాటా ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో చీనీ కాయలు టన్ను గరిష్ఠ ధర రూ.23 వేలు, కనిష్ఠ ధర రూ.8 వేలు పలికింది. అనంతపురం నగరానికి సమీపాన ఉన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.7, కనిష్ఠంగా రూ.4 చొప్పున క్రయవిక్రయాలు జరిగాయి.
News March 15, 2026
అనంత: పన్ను కట్టాల్సిందే.. ప్రజలకు డీపీవో అల్టిమేటం!

బకాయిదారు లబ్ధిదారు తప్పనిసరిగా ఇంటి పన్ను చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. పన్ను విషయంలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. లక్షల్లో బకాయిలు ఉన్నవారు చాలామంది ఉన్నారన్నారు. పెండింగ్ బకాయిదారుల జాబితా తయారు చేశామన్నారు. ఇంటి పన్ను నెలాఖరులోగా తప్పనిసరిగా చెల్లించాలన్నారు. ఎక్కువగా ఉన్న బకాయిదారులు స్పందించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.


