News June 19, 2024
భరతఖండంలో ‘నలంద’ ఎంతో ప్రత్యేకం

427లో ఏర్పాటైన పురాతన నలంద యూనివర్సిటీ బౌద్ధం, గణితం, వైద్యం, రాజకీయం, ఖగోళశాస్త్రం, యుద్ధ విద్య రంగాల్లో ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్దంలో నలందలో ఆచార్య ఆర్యభట్ట నేతృత్వంలో గరిష్ఠంగా 10వేల మంది విద్యార్థులు, 2వేల మంది టీచర్లు ఉండేవారు. 1193లో భక్తియార్ ఖిల్జీ సైన్యం ఈ యూనివర్సిటీని ధ్వంసం చేసింది. 90 లక్షలకుపైగా గ్రంథాలున్న లైబ్రరీకి వారు నిప్పుపెట్టగా ఆ మంటలు చల్లారడానికి 3 నెలలు పట్టిందట.
Similar News
News March 5, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో 26 పోస్టులు

<
News March 5, 2026
4 రోజుల్లో రూ.9,560 తగ్గిన 10గ్రా.ల గోల్డ్ రేటు

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరింది. నాలుగు రోజుల్లోనే రూ.9,560 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పతనమై రూ.1,49,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.
News March 5, 2026
రష్మిక చెల్లిని చూశారా?

రష్మిక-విజయ్ రిసెప్షన్ నిన్న HYDలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత తొలిసారి రష్మిక ఫ్యామిలీ కెమెరాల కంటపడింది. దీంతో వారి వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె చెల్లి 14ఏళ్ల షిమాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు రష్మిక తన చెల్లిని పరిచయం చేస్తూ కనిపించారు. షిమాన్‌కు తనకు 15ఏళ్ల ఏజ్ గ్యాప్ వల్ల ఆమెను బిడ్డలా చూసుకుంటానని గతంలో రష్మిక తెలిపారు.


