News June 19, 2024

మాజీ మంత్రి రోజాపై బుద్ధా వెంకన్న ఫైర్

image

రుషి కొండలోని పర్యాటక స్థలంలో పర్యాటన భవనాలు నిర్మించడం తప్పా అంటూ Xలో మాజీ మంత్రి రోజా చేసిన పోస్టుకు మాజీ MLC TDP నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషి కొండపై కట్టిన నిర్మాణాలు నాడేమో CM ఉండడానికని చెప్పిన రోజా ఇప్పుడేమో పర్యాటకుల కోసం నిర్మించామని చెబుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి రోజాపై ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు ఏంటో బయటికి వస్తాయని అన్నారు.

Similar News

News April 3, 2026

చల్లపల్లి: అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అభినందనీయం

image

అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయం అభినందనీయం అని డీఆర్ఓ సీసీ వెంకటేశ్వరరావు అన్నారు. చల్లపల్లి మండలం మంగళాపురంలో ఇటీవల అగ్నిప్రమాదంలో కర్రా లక్ష్మయ్య పూరిల్లు కాలిపోయింది. వారికి శుక్రవారం రెడ్ క్రాస్ చల్లపల్లి ఛైర్మన్ లీలాబ్రహ్మేంద్ర స్టీల్ సామాన్లు, నిత్యావసర సరుకులు, టార్పాలిన్, రగ్గు, జిల్లా ఛైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ ద్వారా రూ.5వేలు ఆర్థిక సహాయం అందచేశారు.

News April 3, 2026

కృష్ణా : సర్పంచ్‌ల పాలనకు సెలవ్..!

image

కృష్ణా జిల్లాలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సర్పంచ్‌ల పదవీ కాలం ముగియటంతో నేటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో మొత్తం 497 పంచాయతీలు ఉండగా వివిధ కారణాల వల్ల 17 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 470 పంచాయతీల సర్పంచ్ టైమ్ అయిపోవటంతో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించారు.

News April 2, 2026

కృష్ణా: బుక్ చేసిన 3- 8 రోజుల్లో సిలిండర్ల డెలివరీ: JC

image

LPG గ్యాస్ సిలెండర్ల ప్యానిక్ బుకింగ్స్ తగ్గడంతో జిల్లాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బుక్ చేసిన 3 నుంచి 8 రోజుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే DCO ఆఫీస్ నంబర్ 08672-252493, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.