News June 19, 2024

భక్తులకు నాణ్యమైన మజ్జిగ ఇవ్వండి: TTD ఈవో

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధునాతన యంత్రాలతో పాటు క్వాలిటీని మెరుగుపరిచేందుకు ఫుడ్ కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు. భక్తులకు నాణ్యమైన మజ్జిగను పంపిణీ చేయాలని ఆదేశించారు. పాంచజన్యం కిచెన్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.

Similar News

News September 14, 2025

మహిళా శక్తి కారణంగానే భారత్‌కు గుర్తింపు: ఓంబిర్లా

image

AP: భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. ‘స్త్రీలకు గౌరవమివ్వడం ఆది నుంచి వస్తున్న సంప్రదాయం. స్వాతంత్ర్య పోరాటంలోనూ వారు కీలకపాత్ర పోషించారు. సామాజిక బంధనాలు తెంచుకొని అనేక ఉద్యమాలు చేశారు. మహిళా శక్తి కారణంగానే ప్రపంచంలోనే ముఖ్య దేశంగా భారత్ అవతరించింది’ అని చెప్పారు.

News September 14, 2025

యురేనియం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయా?

image

AP: తురకపాలెంలో ఇటీవల సంభవించిన మరణాలకు యురేనియమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. తాజాగా నీటి శాంపిల్స్‌లో <<17705296>>యురేనియం అవశేషాలు<<>> బయటపడినట్లు వార్తలు రాగా, దీనిపైనే చర్చ జరుగుతోంది. కాగా నీరు, ఆహారం వల్ల యురేనియం శరీరంలోకి ప్రవేశిస్తే కిడ్నీల ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. చర్మం, లివర్, లంగ్స్, ఎముకలపై ప్రభావం చూపి అనారోగ్యానికి కారణం అవుతుందని వెల్లడిస్తున్నారు.

News September 14, 2025

ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు సాయం.. పాక్ వక్రబుద్ధి!

image

పాక్ మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిధులను సేకరించింది. అయితే వాటిని బాధితులకు పంచకుండా ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన లష్కరే తోయిబా(LeT) ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు మళ్లించింది. అంతకుముందు LeTకి పాక్ రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. పునరుద్ధరణకు మొత్తం రూ.4.7 కోట్లు ఖర్చవుతుందని, పాక్ ఆ నిధుల సేకరణలో నిమగ్నమైందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.