News June 19, 2024
కరీంనగర్ ఒక ఎమోషన్: స్మిత సబర్వాల్

కరీంనగర్ జిల్లాలో గతంలో కలెక్టర్‌గా పనిచేసిన స్మిత సబర్వాల్‌కు ట్విటర్(X) వేదికగా ‘కరీంనగర్ స్మార్ట్ సిటీ అప్డేట్స్’ ప్రొఫైల్ నుంచి అడ్మిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనిపై స్మిత సబర్వాల్ స్పందించారు. ‘Karimnagar is an emotion’ అంటూ రీట్వీట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు.
Similar News
News November 7, 2025
కరీంనగర్: రాష్ట్ర స్థాయి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. డిసెంబర్ 3న రాష్ట్ర స్థాయిలో జరిగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పురస్కారాలను అందుకునేందుకు అర్హులైన దివ్యాంగుల వ్యక్తులు/సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని జిల్లా సంక్షేమ అధికారిణి సరస్వతీ తెలిపారు. ఎంపికైన వారికి HYDలో అవార్డు ఇవ్వనున్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15లోగా అప్లై చేసుకోలన్నారు.
News November 6, 2025
కరీంనగర్: TNGO జిల్లా కార్యవర్గ సమావేశం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన, పెన్షన్ సమస్య, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం, ఉద్యోగులపై జరుగుతున్న దాడులు, 317 జీవో ప్రభావం వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఓంటేల రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 6, 2025
మానకొండూర్: జ్యోతి వెలిగించి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన కలెక్టర్

మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి ఈ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.


