News June 19, 2024

YS రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలి: TNSF

image

యూనివర్సిటీలలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాన్ని TNSF నేతలు తప్పుబట్టారు. ఇందులో భాగంగా TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ YVU వీసీ ప్రొఫెసర్ చింత సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు.

Similar News

News April 2, 2026

ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన…

image

ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణంలో పాల్గొనేందుకు కడప జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రామయ్య కళ్యాణం ముగిసిన అనంతరం ఒంటిమిట్టలో ఆయన రాత్రి బస చేశారు. ఇవాళ ఉదయం ఒంటిమిట్టలోని హెలిపాడ్ వద్ద నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనకు కలెక్టర్ శ్రీధర్, డీఐజీ కోయ ప్రవీణ్, ఇతర ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు.

News April 2, 2026

కడప: ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్.. 38మందిపై వేటు.!

image

కడప జిల్లా పరిధిలో 38 మంది ITI(ఎలక్ట్రీషియన్) చదవకుండానే పూర్తి చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి, జాబ్‌లో చేరినట్లు విచారణలో వెల్లడైందని APSPDCL CMD శివశంకర్ వివరించారు. కడప పరిధిలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన 38 మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించాల్సిందిగా ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు సహా పలు జిల్లాలలో జరిగిన విచారణలో ఈ అనర్హ నియామకాలు బయటపడ్డాయని తెలిపారు.

News April 2, 2026

కడప: YVUలో ఉద్యోగాలు

image

కడప YVU పీజీ కళాశాల కామర్స్ శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు ఎం.ఎస్.సి (కంప్యూటర్ సైన్స్) /ఎం.సి.ఎ./ ఎం.టెక్. కంప్యూటర్స్ అర్హత ఉండాలన్నారు. నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలన్నారు.