News June 19, 2024

కెప్టెన్, వైస్ కెప్టెన్ సెంచరీలు.. భారత్ భారీ స్కోర్

image

సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(136), కెప్టెన్ హర్మన్(103) సెంచరీలతో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 325 రన్స్ చేసింది. షఫాలీ వర్మ(20), హేమలత(24), రిచా ఘోష్(25) పర్వాలేదనిపించారు. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.

Similar News

News January 15, 2025

ఒక్కరోజులో 5626% పెరిగిన ట్రంప్ కాయిన్!

image

US ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఒక క్రిప్టో కాయిన్ ఉందని తెలుసా! దానిపేరు First Crypto President. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ DTC మార్కెట్ విలువ $141.5M. మొత్తం సప్లై వంద కోట్ల కాయిన్లు. గత 24 గంటల్లో ఇది ఏకంగా 5626% పెరిగింది. $0.0003321 నుంచి $0.01800కు చేరుకుంది. భారత కరెన్సీలో ఇప్పుడు రూ.1.53 పలుకుతోంది. MAGA, WLFI, $POTUS, $DJT సైతం ట్రంప్‌తో సంబంధం ఉన్నవే.

News January 15, 2025

సంక్రాంతి మూవీస్: ఏ సినిమా బాగుంది?

image

ఈ సారి సంక్రాంతికి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, 14న వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో ఈ సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మీరు ఏ సినిమా చూశారు? ఏ సినిమా బాగుందో కామెంట్ చేయండి?

News January 15, 2025

ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు BIG షాక్

image

నామినేషన్లకు ముందు ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్! లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ను విచారించేందుకు EDకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులను విచారించే ముందు ED అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు నవంబర్లో సూచించిన సంగతి తెలిసిందే. కాగా తనపై తప్పుడు ఛార్జిషీటు దాఖలు చేశారని కేజ్రీ ఆరోపిస్తున్నారు.