News June 19, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, YSR, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News March 14, 2026
రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. BRS నుంచి వచ్చిన జగిత్యాల MLA సంజయ్‌కి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైరం ముదిరింది. దీనిపై జీవన్ రెడ్డి Way2Newsతో మాట్లాడుతూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరించినా లాభం లేదని వాపోయారు.
News March 14, 2026
నెతన్యాహు చనిపోయారా?

ఇరాన్‌తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.
News March 14, 2026
FIFA WC, 2028 ఒలింపిక్స్‌కు నో ఎంట్రీ.. ట్రంప్‌కు షాక్ తప్పదా?

USలో ఈ ఏడాది జరిగే FIFA WC, 2028 LA ఒలింపిక్స్‌కు ట్రంప్‌ను, ప్రభుత్వ అధికారులను నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) యోచిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి తమకు చెల్లించాల్సిన $7.3 మిలియన్లను US పెండింగ్‌లో ఉంచడమే కారణమని తెలుస్తోంది. 2014 సోచి వింటర్ ఒలింపిక్స్‌లో రష్యన్, 2024లో చైనా అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినప్పటికీ నిర్దోషులుగా తేల్చడంతో WADA, US మధ్య విభేదాలు ముదిరాయి.


