News June 19, 2024

టీమ్ఇండియాకు మరో టెన్షన్

image

T20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజీకి సంబంధించిన మ్యాచ్ అంపైర్లను ICC ప్రకటించింది. అందులో రిచర్డ్ కెటిల్‌బరో ఉండటంతో టీమ్ఇండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 24న జరిగే ఆస్ట్రేలియా VS ఇండియా మ్యాచ్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఆయన వ్యవహరించనున్నారు. రిచర్డ్ ఉన్న ప్రతి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతూ వస్తోంది. ఆయన అంపైరింగ్‌లో 2014 T20 WC, 2015 ODI WC, 2016 T20 WC, 2017 CT, 2019 ODI WCలోనూ ఇండియా ఓడిపోయింది.

Similar News

News October 8, 2024

ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో రాయితీపై టమాటా, ఉల్లి

image

AP: సెంచరీ దాటిన టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50, ఉల్లి రూ.40-45 చొప్పున విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుతో వెళితే కుటుంబానికి కిలో చొప్పున ఇస్తామన్నారు.

News October 8, 2024

పోలవరం సందర్శకుల ఖర్చులకు రూ.23 కోట్లు విడుదల

image

AP: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ.23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.

News October 8, 2024

పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదల

image

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే, వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్ల మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.