News June 19, 2024
21న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు

నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీ యూనిట్లతో నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. విద్యార్థులకు న్యాయం అందేలా చేసేందుకే ఆందోళనలకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కాగా నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
Similar News
News March 11, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరింది. నిన్నటి నుంచి రూ.1,630 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.850 ఎగబాకి రూ.1,49,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 11, 2026
జాగ్రత్త.. లేపేస్తాం: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్‌ను మరింత బలంగా దెబ్బతీస్తామని ట్రంప్ హెచ్చరించగా.. దీనిపై ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ ఘాటుగా స్పందించారు. ‘మీకంటే గొప్పవారే ఇరాన్‌ను ఏమీ చేయలేకపోయారు. జాగ్రత్త.. లేదంటే మీరే లేకుండాపోతారు’ అని ట్రంప్‌ను హెచ్చరించారు.
News March 11, 2026
కొడుకును వారసుడిగా తిరస్కరించిన ఖమేనీ?

తన కుమారుడు మొజ్తబా వారసుడు కావడం దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఇష్టం లేదట. ఈ మేరకు వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది. అయినా IRGC బలవంతంగా మొజ్తబా పేరును ప్రతిపాదించి కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకునేలా చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ పాలనను వ్యతిరేకించిన అలీ ఖమేనీ నిర్ణయానికి భిన్నంగా సైన్యం ముందుకు వెళ్లడం ఇప్పుడు ఇరాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


