News June 19, 2024

FLASH: APలో భారీగా IASల బదిలీ

image

ఏపీలో భారీగా IASలు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్‌లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌లను నియమించింది.

Similar News

News April 3, 2026

PHOTOS: భూమి ఎంత అందంగా ఉందో చూడండి

image

‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బ్లూ, బ్రౌన్ రంగుల వెలుగుల్లో అద్భుతంగా ప్రకాశిస్తున్న భూమి ఫొటోలను నాసా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు చంద్రుని వైపు ప్రయాణిస్తుండగా స్పేస్ క్రాఫ్ట్‌లోని విండో నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు పేర్కొంది. నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన రాకెట్ ఈ నెల 2న నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

News April 3, 2026

పార్లమెంటు ప్రత్యేక సెషన్ ‘కోడ్’ ఉల్లంఘనే: INC

image

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు ఈనెల 16-18 తేదీల్లో పార్లమెంటు సెషన్ నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయంపై INC మండిపడింది. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించడమేనని విమర్శించింది. ‘ఈనెల 29న తుది పోలింగ్ ముగిశాక పెట్టాలని విపక్షాలు సూచించాయి. మంత్రి రిజిజుకు ఖర్గే లేఖ రాశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికే సభ పెడుతున్నారు’ అని INC నేత జైరామ్ రమేశ్ దుయ్యబట్టారు.

News April 3, 2026

రాముడిగా తెలుగు హీరోల్లో ఎవరు బాగుంటారు?

image

ప్రస్తుత తెలుగు హీరోల్లో శ్రీ రాముడి గెటప్‌లో ఎవరు బాగుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా ‘రామాయణ’ టీజర్‌లో రణ్‌బీర్ రాముడిగా కనిపించడం, ‘వారణాసి’లో మహేశ్ బాబు కూడా ఆ పాత్రలో నటిస్తుండటంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని రాముడిగా చూడాలని కోరుకుంటున్నారు. మరి తెలుగు హీరోల్లో ఎవరు బాగా సెట్ అవుతారు? ఎవరు బాగా నటించగలరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.