News June 19, 2024
శ్రీకాకుళం: PG పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో MSc (అప్లైడ్ కెమిస్ట్రీ) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ (2020-2021 నుంచి అడ్మిట్ అయిన బ్యాచ్‌లు) పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. జూలై 8, 9, 10, 11, 12 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైమ్‌టేబుల్ వివరాలకు https://exams.andhrauniversity.edu.in/వెబ్‌సైట్ చూడవచ్చు.
Similar News
News March 5, 2026
శ్రీకాకుళంలో మార్చి 8న శాప్ లీగ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఎంపికలు

శ్రీకాకుళం జిల్లాలో ‘శాప్ లీగ్ – మాస్టర్స్ స్పోర్ట్స్ (వెటరన్స్)’ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 8న శ్రీకాకుళం ఆర్ట్స్ గ్రౌండ్‌లో ఈ ఎంపికలు జరుగుతాయని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News March 4, 2026
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

★శ్రీకాకుళం: టెన్త్ పాస్.. 230 ఖాళీలకు జాబ్ మేళా
★ సింగుపురం PHCకి కొత్త భవనం మంజూరు చేయాలి: MLA శంకర్
★టెక్కలి: రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
★ఆమదాలవలసలో అస్తవ్యస్తంగా రహదారులు
★SKLM: గిరిజనుల సాగు భూములకు పట్టాలివ్వాలి
★ఎచ్చెర్ల: పొలంలోనే టమాట పంటను వదిలేశారు
★ రెండు మాసాలు ముందే ఖరీఫ్‌కు సిద్ధం: అచ్చెన్నాయుడు
★ శ్రీకాకుళం: సకాలంలో పంచాయతీ ఎన్నికలు లేనట్లే ?
News March 4, 2026
SKLM: పాత నేరస్థులపై నిఘా, కౌన్సిలింగ్ తప్పనసరి

పాతనేరస్థులపై నిఘా, కౌన్సిలింగ్ తప్పనసరిని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కోర్టు వ్యవహారాలు, నాన్ బెయిల్బుల్‌పై విస్తృతంగా చర్చించారు. నూతనంగా ప్రారంభించిన నేరాలు నియంత్రణ హిస్టరీ రికార్డులుపై ఆరా తీశారు.


