News June 19, 2024

పేలవ ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీలు

image

పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి పేలవ ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 8 రాష్ట్రాల్లో కమిటీలు నియమించింది. ఇందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. కురియన్, రకిబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్‌ తెలంగాణలో ఓటమికి గల కారణాలు తేల్చనున్నారు.

Similar News

News February 2, 2026

పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తారా: బొత్స

image

AP: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై TDP దాడులు దారుణమని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘రాష్ట్రానికి మంచి పేరుండేది. దాడులతో దాన్ని చెడగొట్టి చంద్రబాబు అప్రదిష్ఠ తెస్తూ బిహార్‌లా మారుస్తున్నారు. మరే పార్టీకీ కార్యకర్తలు లేరనుకుంటున్నారా? ఇది సంప్రదాయం కాదు. పోలీసులు దగ్గరుండి దాడులు చేయిస్తారా? DGP ఏం చేస్తున్నారు? ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలి’ అని బొత్స కోరారు.

News February 2, 2026

117 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>NCERT<<>> 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్:www.ncert.nic.in

News February 2, 2026

మోమోల కోసం రూ.85లక్షల విలువైన గోల్డ్ ఇచ్చేశాడు

image

మోమోలపై ఉన్న ఇష్టంతో ఉత్తరప్రదేశ్‌లో 7వ తరగతి బాలుడు రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను మోసగాళ్లకు ఇచ్చేశాడు. మోమో స్టాల్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు తన కుమారుడిని మోసం చేశారని బాలుడి తండ్రి విమలేశ్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి నగలు తెస్తే, ఉచితంగా మోమో ఇస్తామని స్టాల్ యజమానులు చెప్పడంతో ఆ బాలుడు ఆభరణాలిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.