News June 19, 2024

HYD‌‌లో మరో దారుణం.. మైనర్‌పై అత్యాచారం

image

HYD చిలకలగూడ PS​ పరిధిలో దారుణం జరిగింది. CI అనుదీప్​ కథనం ప్రకారం.. లాలాగూడకు చెందిన ఓ మహిళ 2022లో అనారోగ్యంతో చనిపోయింది. ఆమె కూతురు(12)ను సోదరి గార్డియన్‌గా పెంచుకుంటుంది. మల్కాజిగిరి వాసి సాయికృష్ణ(25)బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. చిల్డ్రన్​ హోమ్​ నుంచి తన ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్​ చేశాడు. సాయికృష్ణతో పాటు అతడికి సహకరించిన చిల్డ్రన్ ​ హోమ్​ వర్కర్​ లక్ష్మీపై కేసు నమోదైంది.

Similar News

News March 19, 2026

FLASH: త్వరలో ఉప్పల్ రింగ్ రోడ్డు బంద్!

image

ఉప్పల్ రింగ్ రోడ్డు త్వరలో బంద్ కానుంది. రామంతపూర్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ హైవే వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు సెంటర్లో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం పూర్తిగా స్టడీ చేసింది. త్వరలోనే రింగ్ రోడ్డు బంద్ చేసి, ట్రాఫిక్ మళ్లింపులు చేసి, కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు.

News March 19, 2026

HYD: పిల్లి లేదని అమ్మాయి సూసైడ్

image

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్‌పేట్ PSపరిధిలో చోటుచేసుకుంది. బడంగ్‌పేట్‌లోని వెంకటాద్రి నివాస్‌కు హిమబిందు (20) తాను ఎంతో ఇష్టంగా పెంచుకొన్న పెంపుడు పిల్లి మృత్యువాత పడింది. ఇది తట్టుకోలేక పురుగు మందు తాగి హిమబిందు ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 19, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.