News June 20, 2024
BREAKING: ఏపీ డీజీపీగా తిరుమలరావు

ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమలరావు ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News September 15, 2025
బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.
News September 15, 2025
వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలి: సీఎం రేవంత్

TG: రాష్ట్రమంతటా LED వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలన్నారు. అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, అవి పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అన్ని లైట్లను HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.
News September 15, 2025
యునెస్కో జాబితాలోకి మరో 7 ఇండియన్ సైట్స్

భారత్‌లోని మరో 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది.
* పంచగని&మహాబలేశ్వర్(MH) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
* ఉడుపి(KN)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
* మేఘాలయన్ ఏజ్ కేవ్స్(తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
* కిఫిర్(నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
* వైజాగ్(AP)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
* తిరుపతి(AP)లోని తిరుమల కొండలు
* వర్కల(కేరళ) సహజ వారసత్వం