News June 20, 2024
NZB: ఆర్టీసీలో స్టూడెంట్ పాస్ కోసం దరఖాస్తులు ప్రారంభం

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ కోసం దరఖాస్తులు ప్రారంభమైనట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాఠశాలలు, కళశాలల యాజమాన్యాలు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను చెల్లించి సంబంధిత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 7, 2026
NZB: ఆస్తి పన్ను సకాలంలో వసూలు చేయాలి: కమిషనర్

నిజామాబాద్‌లో ఆస్తి పన్నును సకాలంలో వసూలు చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్‌పై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా వసూళ్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా విధులు కేటాయించిన ఇతర శాఖల మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News March 7, 2026
నిజామాబాద్: ఇంట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య..!

నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాకేశ్ (28) అనే యువకుడు శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడికి భార్య, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2026
NZB: కుళాయి గుంతలో పడి వ్యక్తి మృతి

నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. నల్లోల్ల రవి (46) అనే వ్యక్తి తన ఇంటి ముందున్న కుళాయి గుంతలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న ఉదయం ఈ ఘటన జరగ్గా, కాసేపటి తర్వాత గమనించిన సోదరుడు చూసేసరికి రవి మృతి చెందాడు. మృతుడి తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


