News June 20, 2024
జిల్లాలో అల్లరిమూకలు ఆట కట్టించాలి : ఎస్పీ

నెల్లూరు జిల్లా SP ఆరిఫ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల ప్రారంభం, ముగింపు సమయాలలో విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ విజబుల్ పోలీసింగ్ ను నెల్లూరు పోలీసులు నిర్వహిస్తున్నారు. భావితరాల భవిష్యత్‌కు పునాది అయిన బాలికలకు రక్షణ, భద్రత కల్పించాలని ఆదేశించారు. ఈవ్ టీజింగ్, ఇతర నేరాలు అరికట్టాలని, అల్లరిమూకల ఆటకట్టించాలన్నారు. స్కూల్స్, కళాశాలల వద్ద గస్తీ నిర్వహించాలన్నారు.
Similar News
News March 8, 2026
ఫైనల్ మ్యాచ్‌కు నెల్లూరులో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు

నెల్లూరు నగరంలోని పలు రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇండియా- న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని రెస్టారెంట్ యజమానులు ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువత మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఆటను పెద్ద స్క్రీన్‌లో, స్నేహితులతో కేరింతలు కొడుతూ చూడాలని ఆశతో ఉన్నారు.
News March 8, 2026
నెల్లూరు: వారిని జైలు కలిపింది.!

ఆ ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు. వీరిలో రామకృష్ణపై 27 కేసులు, మరో నిందితుడు బిట్రగుంటకు చెందిన మాల్యాద్రిపై14 కేసులు ఉన్నాయి. జైలులో వీరికి పరిచయం ఏర్పడడంతో మరిన్ని చోరీలకు కలిసికట్టుగా చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిన్న బజార్ PS పరిధిలో <<19323990>>చేతివాటం<<>> చూపగా ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.63 వేల నగదు, 153 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
News March 8, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. MP నివాళి

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


