News June 20, 2024
NGKL: ఫ్రీగా నీట్ లాంగ్ టర్న్ కోచింగ్.. మీ కోసం

అచ్చంపేట: సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల బాలబాలికలకు ఉచితంగా నీటిలో లాంగ్ టర్న్ కోచింగ్ ఇస్తున్నట్లు గురుకులాల ఆర్సీఓ వనజ బుధవారం తెలిపారు. షెడ్యూల్డ్ కులాల బాల, బాలికలు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి నీట్ పరీక్షకు హాజరైనవారు www.tgswreis.telangana.gov.in వెబ్ సైట్లో రూ.200. చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 12, 2026
MBNR: “కురుమూర్తి కొండలను కాపాడండి”

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలోని శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి దేవాలయ కొండల వద్ద క్వారీ అనుమతులపై భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ మార్చి 14న ఉదయం 10 గంటలకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1000 చరిత్ర కలిగిన కురుమూర్తి కొండలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.
News March 12, 2026
రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో చెన్నవెళ్లి యువకుడు మృతి

రాజాపూర్ మండల పరిధిలోని చెన్నవెళ్లికి చెందిన చిలివేరి నరేశ్ గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. నరేశ్ రాజాపూర్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తుండగా అతని బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. షాద్‌నగర్ సమీపంలోని ఓ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న నరేశ్ మృతి పట్ల చెన్నవెల్లిలో విషాదఛాయలు అలముకొన్నాయి.
News March 11, 2026
MBNR : పదో తరగతి పరీక్షలు.. ఫోన్ వాడితే ఉద్యోగం ఊస్ట్!

మహబూబ్‌నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ మొబైల్ ఫోన్లతో అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఫోన్ వాడుతూ పట్టుబడితే, వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.


