News June 20, 2024

ఈనెల 20న ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

image

2023 రబీ పంటలకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు గురువారం మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో జిల్లా అధికారులతో కలిసి కేంద్రం బృందం పర్యటించనుంది. తర్లుపాడు మండలంలోని పోతలపాడు, గానుగపెంట, మార్కాపురం మండలంలో వేములకోట, పెద్దారవీడు మండలంలో గొబ్బూరులో రైతులను కలిసి పంట నష్టం వివరాలు, తాగునీటి కొరత తదితర విషయాలపై ఆరా తీయనున్నారు.

Similar News

News March 7, 2026

సంతనూతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

image

సంతనూతలపాడు ఎండ్లూరు డొంక వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగం దెబ్బ తిన్నది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 7, 2026

3000 మందితో మహిళా దినోత్సవ వేడుకలు: JC

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులు ఆదేశించారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 3000 మందితో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్నామన్నారు. దానికి అనుగుణంగా మెప్మా, ఐసీడీఎస్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు.

News March 6, 2026

కొత్తపట్నంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని SI తెలిపారు.