News June 20, 2024

నీట్ కూడా రద్దు చేయండి: ప్రతిపక్షాలు

image

యూజీసీ-<<13472127>>నెట్<<>> తరహాలోనే నీట్ పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘నెట్ రద్దు లక్షలాది విద్యార్థుల విజయం. ఇది అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి పరాభవం. మోదీజీ.. నీట్ పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తారు? నీట్ పరీక్షలోనూ పేపర్ లీకేజీకి మీరే బాధ్యత తీసుకొండి’ అని Xలో పేర్కొన్నారు. ఈ లీకేజీలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారా అని ప్రియాంక ప్రశ్నించారు.

Similar News

News October 8, 2024

రెండు చోట్లా ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్నారు. బుద్గాం, గందర్‌బల్ రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు. కాగా లీడింగ్‌పై స్పందించిన ఒమర్ ఫలితాలపై ఇప్పుడే అంచనాకు రాలేమన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాకే ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన కాంగ్రెస్ ‌కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు.

News October 8, 2024

‘పుష్ప-2’ విడుదల తేదీలో మార్పు?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకంటే ముందే రానున్నట్లు చర్చ జరుగుతోంది. డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఒకరోజు ముందుగానే DEC 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నట్లు తెలిపాయి.

News October 8, 2024

SC, ST విద్యార్థులకు ఉచిత DSC శిక్షణ

image

AP: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 5500 మంది విద్యార్థులకు శిక్షణ అందించే విధంగా స్టడీ సర్కిల్స్‌ను సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించనుంది. గతంలో రెండు డీఎస్సీలకు అలాగే కనీసం 100 మందికి శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయనుంది. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది.