News June 20, 2024
నేడు అమరావతికి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబునాయుడు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. అధికారుల భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు.
Similar News
News March 18, 2026
సంచలనం.. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డికి లింక్?

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయన సూచనతో డ్రైవర్ శరత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ వద్ద డ్రగ్స్ కొన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌లపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
News March 18, 2026
74 మంది ఎమ్మెల్యేలకు TMC షాక్

W.బెంగాల్ CM మమత 74మంది సిట్టింగ్ MLAలకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం పార్టీకున్న MLA(223)లలో ఇది 3వ వంతు కావడం గమనార్హం. 3పర్యాయాలుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నిన్న ప్రకటించిన 291మంది అభ్యర్థుల్లో 135మంది సిట్టింగ్ MLAలు ఉండగా, 15మంది స్థానాలు మారాయి. WBలో APR 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
News March 18, 2026
పితృత్వ సెలవులు ఇవ్వాలి: సుప్రీంకోర్టు

దేశంలోని ఉద్యోగులందరికీ పితృత్వ సెలవులు వర్తించే విధంగా చట్టం తేవాలని SC అభిప్రాయపడింది. దత్తతలో <<19406877>>మాతృత్వ<<>> సెలవులపై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో తండ్రుల పాత్ర కీలకమని, నవజాత శిశువులకు నాన్న మాటలు, స్పర్శ ఎంతో అవసరమని పేర్కొంది. పిల్లల పెంపకం ఏ ఒక్కరి పనో కాదని, వారి బాధ్యతను సమానంగా పంచుకోవాలంది. కాగా ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు ఉద్యోగులకు ఇది అమల్లో ఉంది.


