News June 20, 2024
HYD: కబ్జాలతో గోల్కొండ కోట గోడలు కనుమరుగు!

ఆక్రమణలతో గోల్కొండ కోట ప్రతిష్ఠ మసకబారుతోంది. చట్టం ప్రకారం పురాతన కట్టడం నుంచి సుమారు 300 మీటర్ల మేర ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ గోల్కొండలో మాత్రం ఆక్రమణదారులు ఇష్టానుసారం గోడలు కూల్చేసి భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు కోట చుట్టూ వ్యర్థాలు, జంతు కళేబరాలు పారేయడం, మూత్ర విసర్జన చేస్తుండడంతో ప్రపంచ వారసత్వ హోదా కలగానే మారింది.
Similar News
News November 4, 2025
చేవెళ్ల: 19 మందిని పొట్టన పెట్టుకున్న టిప్పర్ ఇదే..!

మీర్జాగూడలో జరిగిన రోడ్డుప్రమాదంలో 19మందిని పొట్టనపెట్టుకున్న టిప్పర్‌పై 2చలాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నిషేధిత సమయాల్లో భారీ లోడ్‌తో నగరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో చందానగర్, RCపురంలో HYD పోలీసులు చలాన్లు విధించారు. అనిత అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మోతాదుకు మించిన కంకరలోడు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
News November 4, 2025
GHMC పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలు

జీహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం కాప్రా GHMC కార్యాలయంలో నమోదైంది. షేక్‌పేట్ గౌతమ్‌నగర్ ఫంక్షన్ హాల్ వద్ద 4.5 మిల్లీమీటర్లు, బాలానగర్ ఓల్డ్ సుల్తాన్‌నగర్ కమ్యూనిటీ హాల్లో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. రేపు సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.
News November 4, 2025
రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు షేక్‌పేట్ డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌కు హాజరవనున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోతోపాటు కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.


