News June 20, 2024

నల్గొండ: భూముల విలువ పెరగనుంది..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూముల విలువ పెరగనుంది. జిల్లాలో ఎక్కడ ఎంత ధర ఉండాలన్న దానిపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. అధికారులు వారంరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం అత్యధికంగా బేబ్రాజ్ మాచారంలో ఎకరం రూ.1.65 కోట్లు ఉండగా, అత్యల్పంగ తుంగతుర్తిలోని అన్నారంలో ఎకరం రూ.3.30 లక్షలుగా ఉంది. ఇతర ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో మాత్రం ధర విపరీతంగా ఉంది.

Similar News

News November 12, 2025

నల్గొండకు మరో అరుదైన గౌరవం

image

ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ (S&T) ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయం ఢిల్లీలో డిసెంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంశంపై జరిగే ఈ సదస్సు ఆహ్వానం కలెక్టర్‌కు అందింది.

News November 12, 2025

NLG: ఆ సంచి ప్రచారానికేనా..!

image

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు ప్రచారానికే తప్ప బియ్యం తీసుకెళ్లేందుకు పనికిరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంచుల కొలతలు, పోర్టబిలిటీ, బయోమెట్రిక్ నిబంధనలపై రేషన్ డీలర్లు, కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,66,100 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సంచులు కేవలం 12 కిలోల బియ్యం మాత్రమే తీసుకెళ్లేలా రూపొందించారు.

News November 12, 2025

NLG: ఆశల సాగులో రైతన్న.. యాసంగికి సిద్ధం

image

ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో నల్గొండ జిల్లాలో రైతన్న యాసంగి సాగుకు సిద్ధమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. పత్తి, వరి తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూశారు. వానకాలం నష్టాలు మిగిల్చినా యాసంగికైనా కలిసొస్తుందేమో అనే ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నాడు.