News June 20, 2024
అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ CM పవన్ పలు ప్రశ్నలను సంధించారు. ‘ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది? సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఎందుకు ఇవ్వట్లేదు?’ అని ప్రశ్నించారు. వీటికి అధికారులు సరిగా సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం.
Similar News
News March 20, 2026
వివాహంలో ఆటంకాలు.. సర్ప దోష నివారణకు సూచనలు

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.
News March 20, 2026
IPL ఆరంభ మ్యాచ్‌లకు స్టార్క్ దూరం

మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ IPL ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ పేసర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ₹11.75 కోట్లకు సొంతం చేసుకుంది. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్ చేయడం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా స్టార్క్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆసిస్ ప్లేయర్లలో కమిన్స్, హేజిల్‌వుడ్ సైతం కొన్ని IPL మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఎల్లిస్ ఈ సీజన్ మొత్తానికే వైదొలిగారు.
News March 20, 2026
30 ఏళ్లు దాటాయా.. చర్మ సౌందర్యానికి చిట్కాలు

వయసు 30 ఏళ్లు దాటాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్, ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం కూడా మంచిది.


