News June 20, 2024
రాజమండ్రి: అష్టాచమ్మ ఆటలో తలెత్తిన వివాదం.. దారుణ హత్య

రాజమండ్రి రూరల్ లో దారుణం చోటుచేసుకుంది. మార్గాని నాగేశ్వరరావును స్నేహితులు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు .అష్టాచమ్మ ఆటలో తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా సమాచారం. హత్య చేసిన వీరబాబు, రమణ పరారీలో ఉన్నారని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 7, 2026
దూబచర్లలో విషాదం.. బైకును ఢీకొట్టి పరార్

నల్లజర్ల మండలం దూబచర్లలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బైకిస్టు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
News January 7, 2026
జగన్‌తో తానేటి వనిత భేటీ.. చోడవరం ఫ్లెక్సీ వివాదంపై సుదీర్ఘ చర్చ!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తానేటి వనిత మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా చోడవరం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఫ్లెక్సీల వివాదం, అనంతరం తలెత్తిన పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
News January 7, 2026
రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్‌ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.


