News June 20, 2024

కీచక ఎస్సై.. మొదటి నుంచి లైంగిక ఆరోపణలు

image

TG: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసులో డిస్మిస్ అయిన కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ వ్యవహారశైలి మొదటి నుంచే వివాదాస్పదంగా ఉంది. 2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిని లైంగికంగా వేధించాడు. ఎత్తు, కొలతలు చూస్తానంటూ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా అత్యాచారం చేసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.

Similar News

News September 15, 2025

BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

image

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి.

News September 15, 2025

ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

image

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.

News September 15, 2025

రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

image

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.