News June 20, 2024
నేడు 8మంది మంత్రుల బాధ్యతల స్వీకరణ
AP: నేడు రాష్ట్ర సచివాలయంలో 8మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతల్ని చేపట్టనున్నారు.
Similar News
News January 21, 2025
ఉగ్రవాదుల కాల్పుల్లో AP జవాన్ మృతి.. CM దిగ్భ్రాంతి
J&Kలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ <<15207990>>కార్తీక్<<>> మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని AP CM చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News January 21, 2025
బెస్ట్ హనీమూన్ ప్లేస్ ఇదే
ప్రపంచంలో బెస్ట్ హనీమూన్ ప్లేస్‌గా మారిషస్ నిలిచింది. ట్రిప్ అడ్వైజర్ ప్లాట్‌ఫాంలో ఎక్కువ మంది ఈ ద్వీప దేశం మధుర అనుభూతులకు నిలయమని ఓటేశారు. ఏడాదంతా 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఈ దేశం ఇండియన్, ఆఫ్రికన్, ఫ్రెంచ్, చైనా వారసత్వాల కలబోత. సముద్రాలు, సముద్ర జీవులు, బీచ్‌లు, వాటర్ గేమ్స్, గ్రీనరీ, అందుబాటు ధరల్లో లగ్జరీ హాస్పిటాలిటీతో అన్ని ప్రాంతాల వారిని మారిషస్ ఆకట్టుకుంటోంది.
News January 21, 2025
శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడుదల
శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను TTD విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సహా వార్షిక వసంతోత్సవ సేవల టికెట్లు కాసేపటి క్రితం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.