News June 20, 2024
వైసీపీ కౌన్సిలర్లపై దాడి దురదృష్టకరం: గడికోట

రాయచోటిలో వైసీపీ కౌన్సిలర్లపైన దాడి చేయడం దురదృష్టకరమని వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడ్డ రాయచోటి ప్రజలకు ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
Similar News
News November 9, 2025
మాక్ అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యేగా నాగ వైష్ణవి

సింహాద్రిపురం మండలం హిమకుంట్ల పాఠశాల విద్యార్థి డి.నాగ వైష్ణవికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆమె ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభకనబరిచింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
News November 9, 2025
కడప: వివాదంగా మారిన టీచర్లు టూర్

మైదుకూరు మండలం నంద్యాలం పేట కాంప్లెక్స్ పరిధిలోని 20మంది టీచర్లు ఒకేసారి సెలవు పెట్టి టూర్కు వెళ్లారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్ల నుంచి సైతం సెలవు పెట్టడం వివాదాస్పదమైంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో శనివారం లీవ్ ఉంటుందని టీచర్లు ముందుగానే టూర్ ప్లాన్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ లీవ్ రద్దు చేశారు. టూర్ క్యాన్సిల్ చేసుకోలేక అందరూ వెళ్లారు.
News November 9, 2025
విజయవంతమైన జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీ

ప్రొద్దుటూరులోని జార్జ్ కోరోనేషన్ క్లబ్ వద్ద జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ ప్రారంభించారు. 36 మండలాల నుంచి 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఏడుగురు విద్యార్థులను ఎన్నికచేసినట్లు వివరించారు. వీరు ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొటారన్నారు.


