News June 20, 2024
నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

AP: వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన జగన్.. నేడు మరోసారి అందరితో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాలు, రాజకీయ దాడులు, ఈవీఎంలపై చర్చించే అవకాశం ఉంది.
Similar News
News March 22, 2026
IPL 2026 తర్వాత ధోనీ గుడ్ బై: ఉతప్ప

IPL 2026 తర్వాత ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప హింట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ కేవలం ఫినిషర్‌గా కాకుండా ‘మెంటార్ కమ్ ప్లేయర్’గా కనిపిస్తారని తెలిపారు. తన రిటైర్మెంట్ కోసం సిద్ధమవుతున్న ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానానికి పడిపోయే అవకాశం ఉందని, దీనివల్ల రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ మరింత మెరుగుపడుతుందని ఉతప్ప అభిప్రాయపడ్డారు.
News March 22, 2026
రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?

TG: CM హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సిద్దిపేటకు వస్తుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. నియోజకవర్గానికి రావాల్సిన ₹1,000 కోట్ల నిధులు ఆగిపోయాయంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రుణమాఫీ కాని రైతులతో కలిసి నిరసన తెలుపుతామని హరీశ్ ప్రకటించడంతో ఆదివారం పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.
News March 22, 2026
UAEపై ఇరాన్ డ్రోన్ల వర్షం.. అసలు ప్లాన్ ఇదే!

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు UAEని మంటల్లోకి నెట్టింది. 2025లో ట్రంప్ ప్రభుత్వం అందుకున్న $5.2 ట్రిలియన్ల పెట్టుబడుల్లో సింహభాగం (27%) UAE నుంచే వచ్చాయి. అందుకే ఆ దేశంపై దాడులు చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇరాన్ పరోక్షంగా దెబ్బతీస్తోంది. ప్రపంచ పెట్టుబడుల హబ్‌గా ఎదిగిన దుబాయ్ స్థిరత్వాన్ని దెబ్బతీసి గల్ఫ్ దేశాలపై నమ్మకం పోయేలా చేయడం ఇరాన్ వ్యూహం.


